నిర్భయ ప్రతిజ్ఝ చేయాలి
దేశంలో మరోసారి నిర్భయలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అందరూ ప్రతిజ్ఝ చేయాలని అన్నారు ఢిల్లీ సీఎం అరవింద్ క్రేజీవాల్. నిర్భయ దోషులకు ఉరిశిక్ష అమలు చేయడంపై కేజ్రీవాల్ స్పందించారు. బాధితులకు న్యాయం జరగడానికి దాదాపు 7యేళ్లు పట్టింది. నిర్భయ వంటి ఘటనలు పునరావృతం కాకుండా అందరూ ప్రతిజ్ఞ చేయాలన్నారు. మన వ్యవస్థలో చాలా లోటుపాట్లు ఉన్నాయి. వాటిని మెరుగు పరచవలసిన అవసరం ఉందని క్రేజీవాల్ అభిప్రాయపడ్డారు.
మరోసారి ఉరిశిక్షని వాయిదా వేయించేందుకు నిర్భయ దోషుల తరుపు న్యాయవాది ఆఖరి నిమిషం వరకు ప్రయత్నించారు. గురువారం అర్థరాత్రి దాటాక కూడా సుప్రీం కోర్ట్ తలుపు తట్టారు. కానీ అవేవి ఫలించలేదు. దీంతో.. నిర్భయ దోషులైన ముకేశ్ సింగ్ (32), పవన్ గుప్త (25), వినయ్ శర్మ (26), అక్షయ్ కుమార్ సింగ్ (31)లను తిహార్ జైలులో ఉరి తీశారు. పలువురు జైలు అధికారులతోపాటు, జిల్లా మెజిస్ట్రేట్ సమక్షంలో ఇవాళ ఉదయం 5.30 గంటలకు జైలు నంబరు 3లో ఒకేసారి నలుగురు దోషులకు ఉరి శిక్ష అమలు చేశారు.