సీఎం పదవికి కమల్‌నాథ్ రాజీనామా
మధ్యప్రదేశ్ సీఎం కమల్‌నాథ్ రాజీనామా చేశారు. మధ్యప్రదేశ్ అసెంబ్లీలో శుక్రవారం బలపరీక్ష నిర్వహించాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. మధ్యాహ్నం 2గంటలకు శాసనసభలో బలపరీక్ష నిర్వహించాల్సి ఉండగా.. తగిన సంఖ్యాబలం లేకపోవడంతో కమల్ నాథ్ రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు.
ఈ సందర్భంగా కమల్ నాథ్ మాట్లాడుతూ.. “15 నెలల పాటు రాష్ట్రాభివృద్దికోసం కష్టపడి పనిచేశాం. ఐదు సంవత్సరాలు పాలించమని ప్రజలు మాకు అవకాశం కల్పించారు. వ్యవసాయరంగ అభివృద్ధికి కృషి చేశాం, 20లక్షల మంది రైతులకు రుణమాఫీ చేశాం. ప్రజల విశ్వాసానికి అనుకూలంగా పరిపాలించాలని భావించాం. కానీ, మా ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు భాజపా అన్ని ప్రయత్నాలు చేసింది” అన్నారు.