నిర్భయ దోషుల ఉరిపై ప్రధాని స్పందన

నిర్భయ దోషులైన ముకేశ్‌ సింగ్‌ (32), పవన్‌ గుప్త (25), వినయ్‌ శర్మ (26), అక్షయ్‌ కుమార్‌ సింగ్‌ (31)లను ఈ ఉదయం 5:30 గంటలకి తిహార్‌ జైలులో ఉరి తీశారు. జైలు నంబరు 3లో ఒకేసారి నలుగురు దోషులకు ఉరిశిక్ష అమలు చేశారు. దీనిపై నిర్భయ తల్లిదండ్రులు, సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు, ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ప్రధాని నరేంద్ర మోడీ కూడా నిర్భయ దోషుల ఉరిపై స్పందించారు.

“ఎట్టకేలకు న్యాయమే గెలించింది. మహిళలకు భద్రత, గౌరవాన్ని కల్పించడం చాలా ముఖ్యం. ప్రతి రంగంలో మన మహిళా శక్తి రాణిస్తోంది. మహిళా సాధికారితకు అత్యంత ప్రాముఖ్యతనిస్తూ వారికి సమాన అవకాశాలు కల్పించే మెరుగైన సమాజాన్ని అందరం కలిసి నిర్మిద్దాం” అని మోడీ ట్విట్ చేశారు.