నిర్భయ దోషుల ఉరిపై అనసూయ కామెంట్

నిర్భయ దోషుల ఉరిపై సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు, సాధారణ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆలస్యమైనా న్యాయం జరిగిందని నిర్భయ తల్లి ఆశాదేవీ అన్నారు. ఎట్టకేలకు న్యాయమే గెలించిందని ప్రధాని నరేంద్ర మోడీ ట్విట్ చేశారు. తాజాగా టాలీవుడ్ హాట్ యాంకర్, నటి అనసూయ నిర్భయ దోషుల ఉరిపై కొత్తగా స్పందించింది.

ఎప్పుడూ లేనిది.. ఈ సారి హిందీలో ట్విట్ చేసింది. “ఇన్‌సాఫ్‌కి సుభా.. దేర్‌ సే హి సహీ” అంటూ కామెంట్ పెట్టింది. ‘న్యాయ ఆమోదం. తీర్పు ఆలస్యమైనా.. సరైనదే’నని అనయసూయ రాసుకొచ్చింది. ఇక సినిమాల విషయానికొస్తే.. రంగస్థలం తర్వాత అనసూయకి నటనకి ప్రాధ్యాన్యం పాత్రలు దక్కుతున్నాయి. ప్రస్తుతం ఆమె చిరు 152 సినిమా ‘ఆచార్య’లో కీలక పాత్రలో నటిస్తున్నట్టు సమాచారమ్.