సప్రైజ్ : రెండో పెళ్లి చేసుకున్న అమలాపాల్
హీరోయిన్ అమలాపాల్ సడెన్ సప్రైజ్ ఇచ్చింది. గుట్టు చప్పుడు కాకుండా రెండో పెళ్లి చేసుకొంది. గత కొద్దికాలంగా అమలా బాలీవుడ్ నటుడు భవీందర్ సింగ్ తో ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. వీరిద్దరు కలిసి దిగిన, తిరిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయ్. ఇప్పుడీ ఈ జంట సీక్రెట్ గా పెళ్లి చేసుకుంది. పంజాబ్ స్టయిల్ వీరి పెళ్లి జరిగింది. పెళ్లి ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇవి కేవలం పెళ్లి ఫోటోలు మాత్రమే కాదు. రొమాన్స్ ఫోటోలు కూడా. అంతలా ఉన్నాయ్ మరీ !
గతంలో దర్శకుడు ఏ.ఎల్. విజయ్‌ని ప్రేమించి పెళ్లి చేసుకున్న అమలాపాల్. అయితే యేడాది తిరగక్కుండానే వీరి ప్రేమ, పెళ్లి బంధానికి తెరపడింది. మనస్పర్థలతో విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత సినిమాల్లో బిజీ అయిపోయింది అమలా. సినిమాల్లో గ్లామర్ డోస్ కూడా పెంచింది. అమలా-విజయ్ విడిపోవడానికి హీరో ధనుష్ నే కారణమనే ప్రచారం జరిగింది. ఈ విషయాన్ని స్వయంగా విజయ్ తండ్రినే చెప్పడం విశేషం. ఇప్పుడు అమలా రెండో పెళ్లితో సడెన్ షాక్ ఇచ్చింది.