రాజమౌళి దర్శకత్వంలో రామ్ సినిమా

ఎనర్జిటిక్ హీరో రామ్ పంట పడింది. దర్శకధీరుడు రాజమౌళి రామ్ పై పడిందట. ఆయన తదుపరి సినిమా రామ్ తో ప్లాన్ చేస్తున్నట్టు సమాచారమ్. భారీ బడ్జెట్ సినిమాల తర్వాత మీడయం రేంజ్ సినిమా చేయడం రాజమౌళికి అలవాటు. ఈ నేపథ్యంలోనే ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత రామ్ హీరోగా ఓ మీడియం బడ్జెట్ సినిమాని ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది.

ఇప్పటికే రాజమౌళి తండ్రి విజేంద్ర ప్రసాద్ కథపై కసరత్తులు మొదలుపెట్టినట్టు తెలుస్తోంది. వరుస ప్లాపుల్లో ఉన్న రామ్ ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాతో హిట్ ట్రాక్ లోకి వచ్చేశాడు. ప్రస్తుతం రెడ్ సినిమాలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి కిషోర్ తిరుమల దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా తర్వాత నిజంగానే రాజమౌళితో రామ్ సినిమా ఉంటే.. ఆయన పంట పండినట్టే.

ఎన్టీఆర్, రామ్ చరణ్ కథానాయకులుగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్క్కుతోన్న మల్టీస్టారర్ ‘ఆర్ఆర్ఆర్’. ఈ చిత్రంలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా, ఆయనకి జంటగా బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ నటిస్తున్నారు. కొమరంభీమ్ గా తారక్ నటిస్తున్నారు. ఆయనకి జంటగా హాలీవుడ్ హీరోయిన్ ఓలివియా మోరీస్ నటిస్తొంది. అజయ్ దేవగన్, సముద్ర ఖని తదితరులు కీలక పాత్రలో కనిపించనున్నారు. వచ్చే యేడాది జనవరి 8న ఆర్ ఆర్ ఆర్ ప్రేక్షకుల ముందుకు రానుంది.