బాలయ్యకి నో చెప్పిన పాయల్
హాట్ బ్యూటీ పాయల్ రాజ్ పుత్ బాలయ్యతో రొమాన్స్ చేయబోతున్నట్టు ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. బాలయ్య-బోయపాటి హ్యాట్రిక్ సినిమా కోసం పాయల్ ని హీరోయిన్ గా తీసుకున్నారు. పారితోషికం తక్కువ, గ్లామర్ డోస్ ఎక్కువ.. అందుకే పాయల్ ని తీసుకొన్నారని చెప్పుకొంటున్నారు.
తాజాగా ఈ ప్రచారంపై తాజాగా పాయల్ స్పందించింది. ‘నేను ఏ సినిమాకి సంతకం చేయలేదు. బాలయ్య సినిమాలో తాను నటిస్తున్నాననే న్యూస్ ఉట్టి ప్రచారం మాత్రమే’ అని ట్విట్ చేసింది పాయల్. అయితే బాలయ్య సినిమా కోసం తనని సంప్రదించలేదని మాత్రం పాయల్ చెప్పలేదు. ఈ నేపథ్యంలో బాలయ్య సినిమా కోసం చిత్రబృందం పాయల్ ని సంప్రదించిన మాట వాస్తవమే. కానీ ఆమె నో చెప్పినట్టు అర్థమవుతోంది.
ఇక బాలయ్య ప్రతి సినిమాకి హీరోయిన్ సమస్య ఎదురవుతున్న సంగతి తెలిసిందే. యువ హీరోయిన్స్ బాలయ్యతో జోడి కట్టేందుకు అంగీకరించడం లేదు. స్టార్ హీరోయిన్స్ రకరకాల కారణాలతో బాలయ్యకి నో చెబుతున్నారు. మరీ.. ఫైనల్ గా బాలయ్యతో దైర్యం చేసి ఎవరు రొమాన్స్ చేస్తారన్నది చూడాలి. ఇక బాలయ్య-బోయపాటి సినిమా అనగానే ఆ అంచనాలు ఓ రేంజ్ లో ఉంటాయి. దానికి తగ్గట్టుగానే బోయపాటి కథని రెడీ చేసినట్టు తెలుస్తోంది.
Hi all .
An update from my side .
I didn’t sign any movie yet and movie with Balkrishna sir is a rumour.
Thanks lots of love 💓— paayal rajput (@starlingpayal) March 21, 2020