పెళ్లి రూమర్స్ పై స్వీటీ కామెంట్
అగ్రకథానాయిక స్వీటీ అనుష్క ప్రేమ, పెళ్లిపై వచ్చినన్నీ పుకార్లు మరో హీరోయిన్స్ పై రాలేదేమో.. ! గతంలో ఆమె ఓ సీనియర్ హీరోయిన్ గా ఎఫైర్ పెట్టుకుందనే ప్రచారం జరిగింది. బాహుబలి నుంచి ప్రభాస్-అనుష్క ప్రేమ, పెళ్లి ప్రచారం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మధ్యలో స్వీటీ ఓ బిజినెస్ మేన్ పెళ్లాడనుందని, దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు కుమారుడితో స్వీటీ పెళ్లని.. ఇలా రకరకాలుగా ప్రచారం జరిగింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న స్వీటీ పెళ్లి పుకార్లపై స్పందించారు.
“వదంతులనేవి చిత్ర పరిశ్రమలో సాధారణం. ఈ విషయంలో నేనేం చేయలేను. కానీ నాపై అలాంటి వార్తలు ఎందుకు రాస్తుంటారో నాకు అర్థం కాదు. నాపై వదంతులు రాసిన వారికి సోదరీమణులు, పిల్లలు ఉండరా.. అని ఆశ్చర్యపోతుంటా”నన్నారు స్వీటీ
ప్రస్తుతం అనుష్క నిశ్శబ్ధం సినిమాతో బిజీగా ఉంది. హేమంత్ మధుకర్ దర్శకత్వం వహించారు. అంజలి, షాలినీ పాండే, మాధవన్, సుబ్బరాజు కీలక పాత్రలు పోషించారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, కోన ఫిల్మ్ కార్పొరేషన్ సంయుక్తంగా నిర్మించాయి. ఈ సినిమాను ఏప్రిల్ 2న ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలని భావిస్తున్నారు. కానీ కరోనా ఎఫెక్ట్ తో వాయిదా పదేలా ఉంది.