కేసీఆర్ ఆలోచనని అమలు చేస్తున్న క్రేజీవాల్
తెలంగాణ సీఎం కేసీఆర్ ఆలోచనని ఢిల్లీ సీఎం క్రేజీవాల్ పాటిస్తున్నారు. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో అవసరమైతే తెలంగాణ ప్రజలకి ఇంటి వద్దకు వెళ్లి రేషన్ అందిస్తామని సీఎం కేసీఆర్ తెలిపారు. జనతా కర్ఫ్యూపై శనివారం సీఎం కేసీఆర్ మీడియా సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో కరోనా మరింతగా విజృంభిస్తే కూడా ఎదుర్కోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.
ప్రజలకి ఇంటి వద్దకు వెళ్లి రేషన్ అందిస్తాం. ప్రజలని అన్ని విధాల ఆదుకుంటాం. ఇందుకోసం రూ. 5000కోట్లు కాదు.. రూ. 1000కోట్లైనా ఖర్చు చేస్తామన్నారు. ఇప్పుడు ఢిల్లీ సీఎం క్రేజీవాల్ అదే చేస్తున్నారు. కరోనా ఎఫెక్ట్ నేపథ్యంలో సత్వర అవసరం కింది ఢిల్లీలోని 72 లక్షల కుటుంబాలకు రేషన్ అందించనున్నట్లు ముఖ్యమంత్రి కేజ్రివాల్ ప్రకటించారు. అంతే కాకుండా 8.5 లక్షల లబ్దిదారులకు 4 వేల రూపాయల నుంచి 5 వేల రూపాయల వరకు పెన్షన్ అందించనున్నట్లు తెలిపారు. 50శాతం రేషన్ అధికంగా, రెండు రెట్ల పెన్షన్ అధికంగా ఇస్తున్నారు. ఇది నిజంగా అభినందించాల్సిన విషయం.