ఈ నెల 31 వరకు తెలంగాణ లాక్‌డౌన్

24 గంటల జనతా కర్ఫ్యూని పాటిస్తే సరిపోదు. కరోనా కట్టడి కోసం మరింత తీవ్రంగా శ్రమించాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాలతో పాటు పలు రాష్ట్రాలు లాక్‌డౌన్ ప్రకటించాయి. ఈ నెల 31 వరకు తెలంగాణలో లాక్‌డౌన్ కానుందని తెలుస్తోంది. దీనిపై సాయంత్రం సీఎం కేసీఆర్ ప్రకటన చేస్తారని తెలుస్తోంది.

ఇప్పటికే కేంద్రం ప్రకటించిన 175 జిల్లాల లిస్టులో తెలంగాణలోని హైదరాబాద్, రంగారెడ్డి, ఖమ్మం, కరీంనగర్ జిల్లాలునాయి. మిగిలిన జిల్లాల్లోనూ తెలంగాణ ప్రభుత్వం లాక్‌డౌన్ ప్రకటించనుందని తెలుస్తోంది. మరోవైపు కరోనా కట్టకి కేంద్రం మరిన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ నెల 31 వరకు రైళ్లని రద్దు చేసింది. మెట్రో రైళ్లని బంద్ చేయాలని ఆదేశించింది.