హాస్పటల్’లోనూ కనిక టెక్కు చూపిస్తుందట !

బాలీవుడ్ సింగర్ కనికా కపూర్ డాక్టర్లకి చుక్కులు చూపిందట. హాస్పిటల్ లోనూ తనకి సెలబ్రేటీ సౌకర్యాలు కావాలని డిమాండ్ చేస్తోంది. పదే పదే తాను సెలబ్రేటీని తనకి అవి కావాలి. ఇవి కావాలని టెక్కు చూపిస్తుందట. అలాగని కనికాకి తకువ ఏర్పాట్లు ఏమీ చేయలేదు. మంచి ఆహారం. చదువుకోవడానికి న్యూస్ పేపర్లు, ఆమె అలవాట్లకి తగ్గట్టు ఇతర సౌకర్యాలని కల్పిస్తున్నారంట. కానీ, వాటితో కనిక సంతృప్తి చెందడం లేదట. టెక్కు చూపిస్తుందట.

ఇంకా రివర్స్ లో వచ్చి.. వైద్యశాఖ అధికారులు తమ కుటుంబాన్ని నీచంగా చూస్తున్నారని ఆరోపిస్తోంది. కనిక వయసు 41యేళ్లు, కానీ మెడికల్ రిపోర్ట్ 28అని రాశారట. ఆ విషయం బయటికిరావడంపై కూడా కనిక ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. తాము సమాజంలో పలు అవమానాలకు గురవుతున్నామని దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని కనిక డిమాండ్ చేస్తోంది.

ఇటీవల లండన్ వెళ్లొచ్చిన కనిక కపూర్.. ఆ విషయం దానిపెట్టి లక్నోలోని ఓ ఫైవ్ స్టార్ హోటల్ లో పార్టీ ఇచ్చింది. ఈ పార్టీకి పలువురు సెలబ్రిటీలు, ఎంపీలు హాజరైన సంగతి తెలిసిందే. వీరంతా ఇప్పుడు సెల్ఫ్ క్వారంటైన్ కు వెళ్లారు. ఆమెతో టచ్‌ లో ఉన్న 53 మంది అనుమానితులలో 11 మందికి నెగిటివ్ రిపోర్టు రాగా, మిగిలినవారి రిపోర్టులు రావాల్సి వుంది. అయితే తాను చేసిన నిర్లక్ష్యపు పనికి ఏమాత్రం పశ్ఛాతాప పడకుండా.. రివర్స్ లో టెక్కు చూపించడంతో కనికపై పలువురు మండిపడుతున్నారు.