బ్రేకింగ్ : రోడ్లపై కనిపిస్తే.. భారీ ఫైన్ !
కరోనా కట్టిడి కోసం ఈ నెల 31 వరకు తెలంగాణ లాక్డౌన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే లాక్డౌన్ ని సీరియస్ గా తీసుకోని ప్రజలు రోడ్లపైకి వస్తున్నారు. అసలు ఏమీ జరగలేదు. ప్రభుత్వం ఏమీ చెప్పలేదు అన్నట్టుగా తిరుగుతున్నారు. దీనిపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్ అయింది. రోడ్లపై కనిపిస్తే భారీ ఫైన్స్ వేయబోతున్నట్టు తెలుస్తోంది. 1897 యాక్ట్ ప్రకారం కఠిన చర్యలు ఉంటాయని సీఎం కేసీఆర్ చెప్పిన సంగతి తెలిసిందే. దానికి తగ్గట్టుగానే రోడ్లపై కనిపిస్తే ఫైన్ వేయబోతున్నట్టు తెలుస్తోంది.
రోడ్లపై ఎవరికి తిరగడానికి అనుమతి లేదు. రాష్ట్ర వ్యాప్తంగా అన్నీ బంద్ చేశామని తెలంగాణ సీఎస్ తెలిపారు. నిత్యవసర వస్తువుల కోసం తప్ప బయటికి రావొద్దు. ఐదుగురు కంటే ఎక్కువగా గుమికూడి కనిపించకూడదు. రాత్రి 7గంటల నుంచి ఉదయం 6గంటల వరకు ఒక్కరు కూడా బయటకనిపించ కూడదన్నారు. లాక్డౌన్ కఠినంగా పాటించకుంటే.. కఠిన చర్యలు తప్పవని ప్రభుత్వ వర్గాలు హెచ్చరిస్తున్నారు.