ఢిల్లీ: ఏపీ భ‌వ‌న్ లో కులం చిచ్చు…!!

దేశ రాజ‌ధాని ఢిల్లీలో ఏపీ భవన్ సాక్షిగా బయటపడ్డ కులోన్మాదం బ‌య‌ట‌ప‌డింది. అధికారుల మధ్యవాట్స్ అప్ వార్ జ‌రిగింది. దళిత, అగ్రవర్గాల అధికారులుగా చీలిపోయారు ఏపీ భ‌వ‌న్ అధికారులు. ఈనెల 17న తనకు పదోన్నతి దక్కకుండా కొందరు అగ్రకుల అధికారులు అడ్డుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఏపీ భ‌వ‌న్ ఉద్యోగి ఆనంద రావు.

ఏకే సింఘాల్ రెసిడెంట్ కమిషనర్ గా ఉన్న సమయంలో ముగ్గురు సహాయ కమిషనర్లు, ఒక జాయింట్ కమిషనర్ పోస్ట్ మంజూరు చేయాలని సిఫార్సు చేశారట‌. అయితే సహాయ కమిషనర్ పోస్టులురెండుకు కుదించేలా అగ్రకుల అధికారులు ఒత్తిడి చేశారని, తద్వారా తనకు ఆ పదోన్నతి దక్కకుండా అడ్డుకున్నారని ఆనంద‌ర‌రావు వాట్స‌ప్ గ్రూపులో మెసేజ్ పెట్టారు.

ప్రాప్తం లేనప్పుడు ఏమి చేసినా ఉపయోగం లేదని, క్షీరసాగర మధనంలో రాక్షసులు ఎంత కష్టపడ్డా ప్రాప్తం లేకపోయింది అని ఎద్దేవా చేశారు ఏపీ భ‌వ‌న్ లో డిప్యూటీ కమిషనర్ సూర్యనారాయణ. దీంతో వాట్సాప్ గ్రూప్ లోనే అధికారులు మాట‌ల యుధ్దం ప్రారంభ‌మైంది. సూర్యనారాయణ మెసేజ్ తో మనస్తాపం చెందిన దళిత ఉద్యోగులు తిలక్ మార్గ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాల్సిందిగా పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు.