‘లాక్డౌన్’పై పవన్ ట్విట్
కరోనా కట్టడి కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన నిర్ణయాలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా దేశంలోని 80 జిల్లాల్లో కేంద్రం లాక్డౌన్ ప్రకటించింది. మరోవైపు, తెలుగు రాష్ట్రాలతో పాటు పలు రాష్ట్రాలు ఈ నెల 31 వరకు లాక్డౌన్ ప్రకటించారు. అయితే ప్రజలెవ్వరు లాక్డౌన్ ని పట్టించుకోకుండా బయటకి వస్తున్నారు. తిరిగుతున్నారు. దీనిపై ఈ ఉదయం ట్విట్టర్ వేదికగా ప్రధాని నరేంద్ర మోడీ అసంతృప్తి వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.
తాజాగా ప్రధాని నరేంద్ర మోడీ ట్విట్ ని రీ ట్విట్ చేసిన జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ‘ప్రధాని మాట పాటిద్దాం, కరోనా విముక్త భారతాన్ని సాధిద్దాం. మనలని మనం రక్షించుకుందాం’ అని పిలుపునిచ్చారు. “దయచేసి అందరు కరోనా వ్యాధి తీవ్రతని గుర్తించాలి,లాక్ డౌన్ ని విధిగా పాటించాలి. కేంద్ర ప్రభుత్వ ఆదేశాలను,రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ప్రజలందరూ చేత పాటించేలా చర్యలు తీసుకోవాలి” అని పవన్ ట్విట్ చేశారు.
ప్రధాని మాట పాటిద్దాం,కరోనా విముక్త భారతాన్ని సాధిద్దాం…
—————————————
మనలని మనం రక్షించుకుందాం…దయచేసి అందరు కరోనా వ్యాధి తీవ్రతని గుర్తించాలి,లాక్ డౌన్ ని విధిగా పాటించాలి. కేంద్ర ప్రభుత్వ ఆదేశాలను,రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ప్రజలందరూ చేత పాటించేలా చర్యలు తీసుకోవాలి. https://t.co/RFBbMhWyfH
— Pawan Kalyan (@PawanKalyan) March 23, 2020