లాక్‌డౌన్‌పై ఉత్తర్వుల్లో ఏముంది ?
లాక్‌డౌన్‌పై తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సీఎం కేసీఆర్ ఆదివారం చేసిన ప్రకటన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే కరోనా వైరస్‌ను ప్రపంచ ఆరోగ్య సంస్థ మహమ్మారిగా ప్రకటించిందని.. తెలంగాణకు ముప్పు పొంచి ఉన్న దృష్ట్యా కీలక చర్యలు చేపట్టినట్లు ఆదేశాల్లో సీఎస్ పేర్కొన్నారు.
అంటువ్యాధుల నియంత్రణ చట్టం -1897, విపత్తు నిర్వహణ చట్టం-2005 కింద లాక్డౌన్ నిర్ణయం తీసుకున్నట్లు ఆదేశాల్లో స్పష్టం చేశారు. లాక్డౌన్ సమయంలో ఏయే సేవలు అందుబాటులో ఉండనున్నాయి.. ఏమేం మూత పడనున్నాయనే దానితోపాటు ఎలాంటి నిబంధనలు పాటించాలనే అంశాలను ఆ ఆదేశాల్లో పేర్కొన్నారు. ఈ ఉత్తర్వులో అత్యవసర సేవలకు మాత్రమే మినహాయింపు ఇచ్చారు. ఇక ఇప్పటికే అంతర్రాష్ట్ర సరిహద్దును సైతం మూసివేశారు. ప్రజా రవాణాను బంద్ చేశారు.