కరోనాపై కేంద్రం చర్యలు సూపర్

కరోనా కట్టడి కోసం కేంద్రం తీసుకుంటున్న చర్యలలని దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు అభినందించింది. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుని, ల్యాబ్‌ల సంఖ్య పెంచుతూ.. కేంద్రాన్ని ఆదేశించాలని సుప్రీంలో పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిపై విచారణ సమయంలో కేంద్రాన్ని అభినందించింది సుప్రీం.

‘కరోనా వ్యాధి వ్యాప్తి నివారణకు కేంద్రం చేపడుతున్న చర్యలకు మేం ఎంతో సంతృప్తి చెందాం. విమర్శకులు కూడా ప్రభుత్వ ప్రయత్నాన్ని ప్రశంసిస్తున్నారు. ప్రభుత్వం మంచి పనిచేస్తోంది. ఇది రాజకీయం కాదు..కానీ జరుగుతున్నది మాత్రం వాస్తవమే’నని సుప్రీం అభిప్రాయపడింది. ఇక దేశంలో కరోనా కేసుల సంఖ్య 415కు చేరాయి. మరో ఏడు మంది మరణించారు.