సెల్ఫ్ క్వారంటైన్ లో సంగక్కర

ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి శ్రీలంకను సైతం తాకిన సంగతి తెలిసిందే. ఏ దేశం నుంచి ఎవరు తిరిగొచ్చినా క్వారంటైన్‌ అవ్వాలని అన్ని దేశాలు హెచ్చరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో శ్రీలంక క్రికెట్‌ దిగ్గజం కుమార సంగక్కర సెల్ఫ్ క్వారంటైన్ లోకి వెళ్లిపోయారు.

“నాకెలాంటి లక్షణాలు కనిపించలేదు. అలాంటిదేమీ లేదు. కానీ నేను ప్రభుత్వ నిబంధనలు పాటిస్తున్నాను. వారం రోజుల క్రితమే నేను లండన్‌ నుంచి వచ్చాను. మార్చి 1-15 మధ్య విదేశాల నుంచి వచ్చినవారు పోలీసుల వద్ద పేరు నమోదు చేసుకోవాలని, క్వారంటైన్‌ వెళ్లాలని వార్తల్లో చూశాను. మార్గదర్శకాలను అనుసరిస్తున్నాను” అని సంగక్కర ట్విట్ చేశారు.