సుహాసిని కొడుకు కరోనా ?
మణిరత్నం-సుహాసినిల కుమారుడు నందన్ సెల్ఫ్ క్వారంటైన్ లోకి వెళ్లిపోయారు. అలాగని ఆయనకి కరోనా పాజిటివ్ గా తేలలేదు. ఇటీవలే నందన్ లండన్ నుంచి ఇండియా వచ్చారు. విమానాశ్రయంలో వైద్య పరీక్షల తర్వాత ఇంటికి వచ్చారు. అయితే ముందు జాగ్రత్తగా తనను తాను గృహ నిర్బంధం చేసుకున్నారు.
‘లండన్ నుంచి వచ్చి 5 రోజులు అవుతోంది. అప్పటి నుంచి స్వీయ నిర్బంధంలోనే ఉన్నా. ఇది నాకు నేను తీసుకున్న నిర్ణయం. మరో 14 రోజుల వరకు ఈ గది దాటి బయటికి రాను. ఎంత బోర్ కొట్టినా సరే ఇలానే ఉంటా. మన చుట్టూ ఉన్న వారి కోసం మనం చేయగలిగే అతి చిన్న పని ఇది’ అని నందన్ ట్వీట్ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కోరుతున్నది కూడా ఇదే. బాధ్యతగా వ్యవహరించమని. విదేశాల నుంచి వచ్చిన వారు ఇలా సెల్ఫ్ క్వారంటైన్ లోకి వెళ్లడం మంచిది.