అదే జరిగితే.. తెలంగాణలో కనిపిస్తే కాల్చివేత !
కరోనా కట్టడి కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఈ నెల 31 వరకు లాక్డౌన్ ప్రకటించాయి. ఇప్పుడు దాన్ని ఏప్రిల్ 14 వరకు పొడిగిస్తున్నట్టు ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. అయితే తెలంగాణలో లాక్డౌన్ బేఖాతరు చేస్తున్నప్రజలపై సీఎం కేసీఆర్ మండిపడ్డారు. రాష్ట్రాన్ని రక్షించుకునే క్రమంలో ఎలాంటి నిర్ణయమైన తీసుకుంటామని కేసీఆర్ అన్నారు. సమాజానికి ఇబ్బంది కలిగిస్తే అన్ని లైసెన్సులు రద్దు చేస్తామని హెచ్చరించారు.
అప్పటికీ జనాలు మాట వినకపోతే తెలంగాణ వ్యాప్తంగా 24 గంటల కర్ఫ్యూ తప్పదని హెచ్చరించారు. అది వినకపోతే ఆర్మీని రంగంలోకి దింపక తప్పదు. షూట్ అట్ సైట్ ఆర్డర్స్ ఇవ్వక తప్పదన్నారు. అంతవరకు తెచ్చుకోవద్దు.. లాక్డౌన్ పాటించండని సూచించారు. సీఎం కేసీఆర్ మాట్లాడిన కొద్దిసేపటికే మరోసారి జాతిని ఉద్దేశించి మాట్లాడిన ప్రధాని నరేంద్ర మోడీ లాక్డౌన్ ని మరో 21 రోజులు విధిస్తున్నట్టు.. వచ్చే నెల 14వరకు కొనసాగిస్తున్నట్టు ప్రకటించారు.