మెగాస్టార్’కు ఘన స్వాగతం

కరోనా కలవరంతో సినీ అభిమానులకి ఉగాధి గిఫ్ట్ లు అసలు ఉండవ్ అనుకున్నాం. ఇంతలో మెగాస్టార్ చిరంజీవి గుడ్ న్యూస్ చెప్పారు. ఉగాధి రోజున సోషల్ మీడియాలోకి అడుగుపెడుతున్నానని ప్రకటించారు. దీంతో.. సోషల్ మీడియాలోకి మెగాస్టార్ ని ఆహ్వానిస్తూ అభిమానులు పోస్టులు పెడుతున్నారు. ఇక సోషల్ మీడియాలోనూ మెగాస్టార్ రికార్డులు తిరగరాయడం ఖాయమని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

మరోవైపు ఉగాది రోజున అభిమానులకి  మరో గిఫ్ట్ కూడా అందబోతుంది. అదే ‘ఆర్ఆర్ఆర్’ టైటిల్ లోగో, మోషన్ మోస్టర్. ‘బాహుబలి’ తర్వాత రాజమౌళి చేస్తున్న చిత్రమిది. స్వాత్రంత్య్ర సమరయోధులు కోమరం భీమ్, అల్లూరి సీతారామరాజుల కథతో తెరకెక్కుతోంది. ఇందులో కొమరం భీమ్ గా ఎన్టీఆర్, ఆయనకి జోడిగా హాలీవుడ్ హీరోయిన్ ఓలివియా మోరీస్ నటిస్తున్నారు. అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్, ఆయనకి జోడీగా బాలీవుడ్ భామ అలియా భట్ నటిస్తున్నారు.