వారికి సాయం చేయండీ : కేటీఆర్
కరోనా కట్టడికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్రంగా శ్రమిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా పలు కఠిన నిర్ణయాలు తీసుకొంటున్నాయి. ఈ నెల 31 వరకు విధించిన లాక్డౌన్ ని వచ్చే నెల 14 వరకు పొడిగించారు. తప్పక ఈ నిర్ణయం తీసుకొన్నాం. 21 రోజులు లాక్డౌన్ చేయకుంటే 21 యేళ్లు వెనక్కి వెళ్లే పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. అయితే లాక్డౌన్ సమయాల్లో జీవనం కొనసాగించలేని పరిస్థితి కొందరికి.
వారికోసం మంత్రి కేటీఆర్ ఓ పిలుపునిచ్చారు. కలిగిన వారు పెద్ద మనసు చేసుకొని తమ తమ పరిధిలో క్యాబ్/ఆటో డ్రైవర్స్ తదితరులని ఆదుకోవాలని పిలుపునిచ్చారు. కరోనా కఠిన కాలంలో తమవంతుగా సాయం చేసేందుకు ఇప్పటికే పలువురు ముందుకొస్తున్న సంగతి తెలిసిందే. హీరో నితిన్ రూ. 10లక్షల విరాళం ప్రకటించారు. ఆయన దారిలో పలువురు ముందుకొచ్చి పెద్ద మనసు చాటుకొంటున్నారు.
Guys, next 3 weeks will be a test to our collective resolve as #IndiaFightsCorona
Adversity reveals our character
Show the largesse of your heart towards people who are below you in the economic pyramid; your domestic help, cab/auto drivers etc
They are the most vulnerable 🙏 pic.twitter.com/130DDwELo3
— KTR (@KTRTRS) March 24, 2020