రెజీనా బ్లూ అందాలు


అందం+అభినయం రెజీనా సొంతం. కానీ బిజీ హీరోయిన్ కాలేకపోయింది. స్టార్ హీరోయిన్ అనిపించుకోలేకపోయింది. దీనికి కారణం లక్కు లేకపోవడమేనని చెబుతుంటారు. లక్కులేని హీరోయిన్స్ గా పిలవబడే లిస్టులో రెజీనా నెం.1 స్థానంలో ఉంటుంది. అయితే రెజీనా పోరాటం మాత్రం ఆపడం లేదు. స్టార్ హీరోయిన్ గా ఎదిగేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉంది.

‘ఎవరు’తో హిట్ కొట్టిన రెజీనా ఏకంగా మెగాస్టార్ చిరంజీవితో చిందేసే ఛాన్స్ కొట్టేసింది. కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ఆచార్య సినిమాలో ఐటమ్ సాంగ్ లో కనిపించబోతుంది. ఇప్పటికే సాంగ్ చిత్రీకరణ పూర్తయింది. అద్భుతంగా వచ్చింది. రెజీనా డ్యాన్స్ కి మెగాస్టార్ ఫిదా అయ్యారనే న్యూస్ లీకైంది.

తాజాగా రెజీనా కొత్త ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇందులో బ్లూ కలర్ డ్రెస్ లో క్లీవేజ్ షోతో అదరగొట్టేసేంది. చూడ్డానికి రెండు  కళ్లు చాలడంలేదు. అయితే రెజీనా అందంలో ఏదో తేడా కొడుతుందని ఆమె అభిమానులు గుసగుసలాడుకొంటున్నారు. అది వయసు తెచ్చిన తేడా కాబోలు అని సర్థి చెప్పుకొంటున్నారు.