వారికి అడ్వాన్స్ గా నాలుగు నెలల జీతం

దేశంలో కరోనా విజృంభిస్తోంది. దానిని కట్టడి చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ఇందులో భాగంగా ఏప్రిల్ 14 వరకు లాక్‌డౌన్‌ ప్రకటించారు ప్రధాని నరేంద్ర మోడీ. తాజాగా ఒడిషా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. డాక్టర్లు, పారామెడికల్ సిబ్బంది, హెల్త్ కేర్ వర్కస్ కి నాలుగు నెలల జీతాన్ని అడ్వాన్స్ గా ప్రకటించారు సీఎం నవీన్ పట్నాయక్. ఈ కష్ట సమయంలో వైద్యులని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ నేపథ్యంలోనే వారికి 4నెలల జీతాన్ని అడ్వాన్సుగా చెల్లించాలని ఒడిషా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

ఇక తెలుగు రాష్ట్రాల్లో కరోనా విజృంభిస్తోంది. బుధవారం తెలుగు రాష్ట్రాల్లో నాలుగు కొత్త కేసులు నమోదయ్యాయ్. తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 41కి చేరగా.. ఏపీలో 9కి చేరింది. అయితే భయపడాల్సిన పరిస్థితి ఏమీ లేదు. కరోనా పాజిటివ్ రోగుల కోలుకుంటున్నారు. అయితే ప్రభుత్వం సూచించినట్టుగా ప్రజలు ఎవరు కూడా బయటికిరావొద్దు. ఇంటికే పరిమితం కావాలి. అప్పుడే కరోనా మహమ్మారి అంతు చూడొచ్చని చెబుతున్నారు.