వైరల్ : పవన్-కేటీఆర్ ట్విట్టర్ సంభాషణ
‘సర్ ఎందుకు.. తమ్ముడూ అంటే సరిపోతుంద’ని మంత్రి కేటీఆర్.. జనసేన అధినేత, పవర్ స్టార్ కల్యాణ్ ని కోరడం హాట్ టాపిక్ గా మారింది. దేశం మొత్తం లాక్‌డౌన్ అమలులో ఉంది. ఈ సమయంలో సహాయార్ధం పవన్ తెలుగు రాష్ట్రాల సీఎం రిలీఫ్ ఫండ్‌కు చెరో రూ. 50 లక్షలు ఇచ్చిన సంగతి తెలిసిందే. దానికి మంత్రి కేటీఆర్ పవన్‌కు ధన్యవాదాలు తెలిపారు.
“ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో కేసీఆర్ నాయకత్వంలో సమర్థంగా మీ విధులు నిర్వహిస్తున్నందుకు ధన్యవాదాలు” అంటూ కేటీఆర్‌ను ఉద్దేశించి పవన్ ట్వీట్ చేశారు పవన్. అందులో కేటీఆర్‌ను సర్ అని పవన్ సంబోధించారు. దీనిపై స్పందించిన కేటీఆర్ ”ధన్యవాదాలు అన్నా.. అయినా మీరు నన్ను సర్ అని పిలవడం ఎప్పటి నుంచి మొదలుపెట్టారు. నేనెప్పుడూ మీ తమ్ముడినే. అలానే పిలవండి” అని కోరారు. దానికి పవన్ ‘సరే తమ్ముడూ’ అని రిప్లై ఇచ్చారు. ఇప్పుడీ ట్విట్టర్ చాట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.