మైత్రీ, హారిక కరోనా సాయం ఎంతంటే ?
కరోనా కట్టడి కోసం తెలుగు సినీ పరిశ్రమ నుంచి విరాళాలు వస్తూనే ఉన్నాయి. ఎవరికివారు తమకి తోచినంత సాయం చేస్తున్నారు. గొప్ప మనసుని చాటుకొంటున్నారు. శుక్రవారం ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ రెండు తెలుగు రాష్ట్రాలకు రూ.20 లక్షల విరాళాలన్ని ప్రకటించారు. ఇది పరీక్షా సమయం కరోనా వైరస్ను మనం అందరం ఎదుర్కోవాలి. అందుకోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అద్భుతంగా శ్రమిస్తున్నాయని మైత్రీ తెలిపింది.
మరో నిర్మాణ సంస్థ హారిక అండ్ హాసిని క్రియేషన్స్ సంస్థ అధినేత ఎస్.రాధాకృష్ణ (చినబాబు) రూ. 20 లక్షలు విరాళం ప్రకటించారు. ఇందులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి రూ.10 లక్షలు, తెలంగాణా ప్రభుత్వానికి రూ.10 లక్షలు ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ సంస్థ ఆ స్థాన దర్శకుడు, మాటల మాత్రికుడు త్రివిక్రమ్ కూడా తనవంతుగా కరోనా సాయం చేసిన సంగతి తెలిసిందే.
ఇక దర్శకుడు సుకుమార్ తనవంతుగా రూ. 10లక్షల సాయం ప్రకటించారు. ఇందులో రెండు తెలుగు రాష్ట్రాలకి చెరో రూ. 5లక్షలు ఇస్తున్నట్టు తెలిపారు. సుకుమార్ తాజా సినిమా అల్లు అర్జున్ తో ఉండనుంది. ఇప్పటికే ప్రారంభోత్సవం కూడా జరుపుకుంది. కరోనా ప్రభావం తగ్గాక రెగ్యూలర్ షూటింగ్ ప్రారంభం కానుంది.