‘భీమ్ ఫర్ రామారాజు’పై మెగాస్టార్ ఎగ్జైట్ చూశారా ?

ఎన్టీఆర్, రామ్ చరణ్ కథాయకులుగా దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న మల్టీస్టారర్ ‘రౌద్రం రణం రుధిరం’ (ఆర్ఆర్ఆర్). శుక్రవారం (మార్చి 27) రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా.. ‘భీమ్ ఫర్ రామరాజు’ పేరిట ఆయన లుక్ ని విడుదల చేశారు. తారక్ వాయిస్ ఓవర్ తో ఈ వీడియోని రూపొందించారు.

“ఆడు కనబడితే నిప్పు కణం నిలబడినట్టుటది. కలవడితే ఏగుసుక్క ఎగబడినట్టుటది. ఎదురువడితే సావుకైన చెమట దారకడటది. ప్రాణమైన, బందుకైనా వానికి బాన్ చన్ అయితది. ఇంటిపేరు అల్లూరి. సాకింది గోదారి. నా అన్న మన్యందొర అల్లూరి సీతారామరాజు” అంటూ ఘనంగా పరిచయం చేశారు తారక్. ఈ ఒక్క వీడియో చాలు ‘ఆర్ఆర్ఆర్’ ఏ రేంజ్ లో ఉండబోతుంది అన్నట్టుగా ఉంది. దీనిపై మెగాస్టార్ చిరంజీవి ఎగ్జైట్ అయ్యారు. అద్భుతంగా ఉందంటూ ప్రశంసల జల్లు కురిపించాడు.

“అదిరింది.. రాజమౌళి. మీ అంబులపొది లోంచి వదిలిన రామబాణం ఈ సీతారామరాజు. అమోఘం తారక్. దుమ్ము లేపారు. మాలో ఉత్సాహం నింపారు. తారక్ నుంచి గుర్తిండిపోయే బర్త్ డే సప్రైజ్” అంటూ ఎగ్జైట్ అయ్యారు చిరు.