సోష‌ల్ మీడియాపై హరీష్ అలా ఎందుక‌న్నార‌బ్బా…!?

మంత్రి హ‌రీష్ రావ్ సోష‌ల్ మీడియా గురించి ఓ హిత‌వు చెప్పారు. కాకా వ‌ర్థంతి స‌భ‌లో మాట్లాడుతున్న ఆయ‌న కాకా గురించి మాట్లాడుతూ మ‌ధ్య‌లో అనుకోకుండా సోష‌ల్ మీడాయా గురించి చెప్పుకొచ్చారు. కాకాకు నిజ‌మైన నివాళి కాళేశ్వ‌రం ప్రాజెక్టు పూర్తి చేయ‌డ‌మేనన్నారు హ‌రీష్.

విద్యార్థులు సోషల్ మీడియా కు బానిసలు కావద్దంటూ హిత‌వు ప‌లికారు మంత్రి హ‌రీష్. మూడేళ్లు సోషల్ మీడియా కు తలవంచక పోతే జీవితం లో తలెత్తుకుని తిరిగే పరిస్థితి వస్తుందన్నారు. .సోషల్ మీడియా కు తలవంచితే జీవితం లో తలవంచినట్టేనని హెచ్చ‌రించారు. కెసిఆర్ పోరాట పటిమ ను విద్యార్థులు ఆదర్శంగా తీసుకోవాలని ఆయ‌న సూచించారు.