కరోనా ఎఫెక్ట్ : కరెంట్ బిల్లులు వాయిదా
కరోనా ఎఫెక్ట్ తో దేశంలో లాక్డౌన్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వచ్చే మూడ్నేళ్ల పాటు ఈఐఎంలు కట్టాల్సిన పనిలేదని ఆర్భీఐ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో విద్యుత్ శాఖ కూడా కీలక నిర్ణయం తీసుకునుందని తెలుస్తోంది. వచ్చే మూడు నెలలు విద్యుత్ బిల్లులు చెల్లించడంలో ఆలస్యమైనా జరిమానా మినహాయించనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.
అన్ని రాష్ట్రాల రెగ్యులేటరీలకు కేంద్ర విద్యుత్ రెగ్యులేటరీ సంస్థ ఇవాళ స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేయనున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. దీనిపై గత రెండ్రోజులుగా విద్యుత్ శాఖ అధికారులతో కేంద్ర ఇంధనశాఖ మంత్రి ఆర్.కె.సింగ్ సంప్రదింపులు జరిపినట్లు సమాచారం. ఇక దేశంలో కరోనా వైరస్ రోజురోజూకి విజృంభిస్తోంది. ఇప్పటి వరకు దేశంలో 873, తెలంగాణలో 59 కరోనా కేసులు నమోదయ్యాయి.