కరోనాపై బ్రావో.. పాట విన్నారా ?

కరోనాపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు సినీ, క్రీడా ప్రముఖు తమవంతు ప్రయత్నం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే టీమ్ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీతో పాటు అనేక మంది క్రికెటర్లు కరోనాపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు సామాజిక మాధ్యమాల్లో సందేశాలిచ్చారు. ఇండ్లకే పరిమితం కావాలని, ప్రభుత్వ మార్గదర్శకాలను పాటించాలని ప్రజలకు సూచించారు. తాజాగా వెస్టిండీస్ ఆల్రౌండర్ డ్వైన్ బ్రావో కరోనాపై ఓ పాటను విడుదల చేశాడు.

‘వీ ఆర్ నాట్ గివింగ్ అప్’ పేరిట ఇన్స్టాగ్రామ్లో ఈ పాటను శనివారం పోస్ట్ చేశాడు. నమస్కారంతో బ్రావో పాటను ప్రారంభించడం విశేషం. ఇదివరకే ఎన్నోసార్లు బ్రావో తన గాత్రం, నృత్యంతో అభిమానులను అలరించిన విషయం తెలిసిందే. ఈ పాటలో బ్రావో స్వయంగా పాట పాడి డ్యాన్స్ చేశాడు. కరోనాపై యుద్ధం కొనసాగిద్దామంటూ ప్రజలకు పిలుపునిచ్చాడు. అందరూ ఇండ్లలోనే ఉంటూ జాగ్రత్తలు తీసుకోవాంటూ సూచించాడు.