6నెలల పాటు లాక్డౌన్ ?
కరోనా వైరస్ ప్రపంచ దేశాలని వణికిస్తోంది. కరోనా కట్టడి కోసం ప్రపంచ దేశాలు లాక్డౌన్ ప్రకటిస్తున్నాయి. ఇప్పటికే లాక్డౌన్ అమలులో ఉన్నదేశాలు.. మరికొంత కాలం పొడిగించే ఆలోచనలు చేస్తున్నాయి. ఈ క్రమంలో బ్రిటన్లో లాక్డౌన్ ఆరుమాసాల పాటు పొడిగించాలని ఆ దేశాధికారులు ఆలోచిస్తున్నారు. బ్రిటన్ డిప్యూటీ చీఫ్ మెడికల్ ఆఫీసర్ జెన్నీహారీస్ ఇందుకు సిద్దపడాలని ఇప్పటికే ప్రజలకు సూచించారు.
బ్రిటన్ లో కరోనా అదుపునకు 21రోజుల లాక్డౌన్ అమలౌతోంది. అయితే ప్రస్తుతం వ్యాధి తీవ్రతను దృష్టిలో పెట్టుకుంటే 21రోజుల లాక్డౌన్ సరిపోదని అధికారులు భావిస్తున్నారు. లాక్డౌన్ ఆరుమాసాల వరకు కొనసాగించే అవకాశాల్ని పరిశీలిస్తోంది. దీనిపై తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఇక లాక్ డౌన్ దేశాల జాబితాలో రష్యా కూడా చేరనుంది. కరోనా కట్టడిలో భాగం ఈ దేశం కూడా లాక్ డౌన్ కు వెళ్లేందుకు సిద్దమవుతుంది.