‘సి.సి.సి’ (కరోనా క్రైసిస్ చారిటీ)కి భారీగా విరాళాలు

కరోనా ప్రభావం అన్నీ రంగాలపై పడింది. సినిమా పరిశ్రమపై ఇంకాస్త ఎక్కువని చెప్పాలి. కరోనా ఎఫెక్ట్ తో సినిమా షూటింగ్ క్యాన్సిల్ అయ్యాయ్. దీంతో సినీ కార్మికులకి ఉపాధి లేకుండా పోయింది. ఈ  నేపథ్యంలో వారిని ఆదుకొనేందుకు సినీ ప్రముఖులు ముందుకొచ్చారు. మెగాస్టార్ చిరంజీవి ఆధ్వ‌ర్యంలో సి.సి.సి. మ‌న‌కోసం (క‌రోనా క్రైసిస్ చారిటీ మ‌న‌కోసం) అనే సంస్థ‌ని ఏర్పాటు చేశారు.

ఈ సంస్థలో సురేష్ బాబు, తమ్మారెడ్డి భరద్వాజ, ఎన్‌.శంక‌ర్, క‌ల్యాణ్, దాము సభ్యులుగా ఉన్నారు. దీని ద్వారా చిత్ర ప‌రిశ్ర‌మ కార్మికుల సంక్షేమార్థం ప‌లు కార్య‌క్ర‌మాలు చేప‌ట్టాల‌ని నిర్ణ‌యించారు. ఈ సంస్థకి చిరంజీవి కోటి రూపాయ‌లు, నాగార్జున కోటి రూపాయ‌లు, ఎన్టీఆర్ 25ల‌క్ష‌ల విరాళం ఇచ్చారు. వీరిని స్పూర్తిగా తీసుకొని మరికొందరు విరాళాలు ఇచ్చేందుకు ముందుకు వచ్చే ఛాన్స్ ఉంది.