5నిమిషాల్లో కరోనా టెస్ట్

కరోనా నిర్థారణ టెస్ట్ కి కొత్త టెక్నాలజీని తీసుకొచ్చింది అమెరికాకు చెందిన అబోట్ ల్యాబొరేటరిసీస్ సంస్థ. ఒక మనిషిలో కరోనా వైరస్‌ నిర్ధారణ పరీక్షకు ప్రస్తుతం ఒకట్రెండు రోజుల సమయం పడుతోంది. అయితే అబోట్ ల్యాబొరేటరిసీస్ మాత్రం కరోనా పరీక్షని కేవలం 5నిమిషాల్లో పూర్తి చేసే టెక్నాలజీని తీసుకొచ్చింది. దీనికి ఆ దేశ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్ డీఏ) అనుమతి కూడా ఇచ్చింది.

వచ్చే వారం నుంచి దీన్ని అందుబాటులోకి  తెస్తామని సదరు సంస్థ ప్రకటించింది. ఈ ప్రక్రియలో కరోనా వైరస్‌ వుంటే కనుక ఫలితం ఐదు నిమిషాల్లోనే వస్తుందని తెలిపింది. నెగిటివ్ ఉంటే మాత్రం ఫలితం రావడానికి 13 నిమిషాల సమయం పడుతుందని తెలిపారు.