గుడ్ న్యూస్ : ఏప్రిల్ 7 తర్వాత కరోనా ఫ్రీ తెలంగాణ

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గుడ్ న్యూస్ చెప్పారు. ఏప్రిల్ 7 తర్వాత కరోనా ఫ్రీ తెలంగాణని చూడబోతున్నామన్నారు. ఆదివారం ప్రగతి భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కరోనా, రైతుల అంశాలపై మాట్లాడారు. చికిత్స పొందిన 11మంది కరోనా బాధితులు వైరస్‌ నుంచి కోలుకున్నట్లు తెలిపారు. 58 మంది పరిస్థితి నిలకడగా ఉందని, వారిని కూడా పరిస్థితులను బట్టి విడతల వారీగా డిశ్చార్జి చేస్తామని వివరించారు.

విదేశాల నుంచి రాకపోకలను పూర్తిగా స్తంభింప చేశామని, కేంద్రం కూడా విమానాశ్రయాలు, పోర్టులన్నీ మూసివేసిందని సీఎం తెలిపారు. అందువల్ల కొత్త కేసులు నమోదయ్యే అవకాశం చాలా తక్కువని సీఎం అన్నారు. రాష్ట్రంలోనూ కొత్త కేసులు నమోదు కాకపోతే ఏప్రిల్‌ 7 తర్వాత కరోనా బాధితులే ఉండరని చెప్పారు.