ధోని ఆ డబ్బు కోసమే క్రికెట్ ఆడాడా ?

టీమిండియా మాజీ సారథి ఎంఎస్ ధోనీ ఎంత చెప్పినా తక్కువ. భారత క్రికెట్ కు దొరికిన ఆణిముత్యం. వన్డే, టీ20 ప్రపంచకప్‌లను గెలిచాడు. అంతకుమించి అత్యుత్తమ ఫినిషర్‌ కనిపించుకున్నాడు. కెప్టెన్ కూల్ గా పేరు తెచ్చుకున్నాడు. అయితే కెరీర్ ప్రారంభంలో ధోనికి పెద్దగా లక్ష్యాలు ఉండేవి కాదట. ఈ విషయాన్ని టీమ్‌ఇండియా మాజీ బ్యాట్స్‌మన్‌ వసీమ్‌ జాఫర్‌ బయటపెట్టారు.

ట్విటర్‌లో ఓ అభిమాని ధోనీతో నీకు ఉన్న ఏదైనా మంచి జ్ఞాపకాన్ని పంచుకోవాలని కోరగా జాఫర్‌ ఓ ఆసక్తికర విషయం చెప్పాడు. ”భారత జట్టులోకి వచ్చిన తొలి రెండేళ్లలో ధోనీ ఒక సారి నాతో ఇలా అన్నాడు. క్రికెట్‌ ఆడి రూ.30 లక్షలు సంపాదించి.. ఆ తర్వాత మిగిలిన జీవితాన్ని రాంచీలో ప్రశాంతంగా గడపాలి” అని ధోనీ తనతో అన్నాడని జాఫర్‌ ట్విట్ చేశారు. అయితే ఆ తర్వాత ధోని యేడాది యేడాదికి వందల కోట్లు సంపాదించిన సంగతి తెలిసిందే.