మద్యం దొరక్క 6గురు ఆత్మహత్య

లాక్‌డౌన్‌ కారణంగా దేశ వ్యాప్తంగా అన్ని వైన్స్‌, బార్‌ షాపులను మూసివేసిన విషయం తెలిసిందే. దీంతో మద్యం ప్రియులు తట్టుకోలేకపోతున్నారు. తాగుడుకు బానిస అయినవారు తల్లడిల్లిపోతున్నారు. మానసిక వేదనకు గురిఅవుతున్నారు. తట్టుకోలేక ఆత్మహత్య చేసుకొంటున్నారు. ఇప్పటి వరకు 6గురు మందు బాబులు ఆత్మహత్య చేసుకొన్నారు. కర్ణాటకలో శని, ఆదివారాల్లో నలుగురు మందుబాబులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. అదేవిధంగా, కేరళలో ఇద్దరు వ్యక్తులు మద్యం దొరక్క ఆదివారం బలవన్మరణానికి పాల్పడ్డారు.

ఈ నేపథ్యంలోనే మద్యం దుకాణాలని రోజుకి కొన్ని గంటల పాటైన తెరవాలనే డిమాండ్ సోషల్ మీడియా వేదికగా వినిపిస్తొంది. తెలంగాణలోనూ ఆదివారం నుంచి వైన్‌ షాపులను తెరుస్తారనే న్యూస్ వైరల్ అయింది కూడా. అయితే ఇది ఫేక్ న్యూస్ తేలింది. ఇక మద్యం అందుబాటులో లేకపోవడంతో అందరూ కల్లును ఆశ్రయిస్తున్నారు. దీంతో కళ్లుకు డిమాండ్ పెరిగింది. రేటు పెరిగింది.