సీఎం కేసీఆర్’కు సెల్యూట్ చేసిన విలన్

కరోనా కట్టడి విషయంలో ప్రధాని నరేంద్ర మోడీ కంటే సీఎం కేసీఆర్ నే బెటర్ అనిపిస్తున్నాడని సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఆదివారంలో మీడియాతో మాట్లాడిన సీఎం కేసీఆర్ పొరుగు రాష్ట్రాల కూలీలకి భరోసా ఇచ్చారు. వారందరికీ 12కిలోల బియ్యం, పిండి పంపిణీ చేస్తామని, ఇంట్లో ఎంతమంది ఉన్నా.. ఒక్కొక్కరికి చొప్పన రూ. 500 ఇస్తామని తెలిపారు.

పొరుగు రాష్ట్రాల కూలీలని తమ బిడ్దలుగా చూసుకుంటామని సీఎం కేసీఆర్ అన్నారు. కూలీలంతా దగ్గరలోని పోలీస్ స్టేషన్, లోకల్ లీడర్లని కలవాని.. కరోనా సాయంపొందాలని సూచించారు. దీనిపై సర్వాత్ర ప్రశంసలు దక్కుతున్నాయి. తాజాగా బాలీవుడ్ నటుడు సోనూసూద్ సీఎం కేసీఆర్ పై ప్రశంసలు కురిపించారు. ‘నిజమైన నేత కేసీఆర్‌కు సెల్యూట్‌’ అంటూ సోనూ సూద్‌ ట్వీట్‌ చేశాడు.