రష్మీ ఎమోషనల్ పోస్ట్

కరోనా విజృంభిస్తున్న కఠిన సమయాన అందరూ ముందుకొచ్చి సాయం చేయాలి. విరాళాలు ఇవ్వాలని కోరింది యాంకర్ రష్మీగౌతమ్. ఈ మేరకు ఓ వీడియోని విడుదల చేసింది.

“కనీసం ఒక్క రూపాయి ఇచ్చినా సాయం చేసినట్లే అవుతుంది. విరాళాలు అంటే పెద్ద మొత్తంలో మాత్రమే చెల్లించాల్సిన అవసరం లేదు. చాలా మంది కలిసి ఒక్కో రూపాయి సాయం చేసినా చాలా ఉపయోగపడుతుంది. పేదవారు తిండికి దూరమవుతున్నారు. ప్లీజ్‌ ప్లీజ్‌ ప్లీజ్‌ వారికి సాయం చేద్దాం” అంటూ రష్మీ ఎమోషనల్ గా చెప్పింది. ఇక సినీ కార్మికుల కోసం రష్మీ తనవంతు సాయంగా రూ. 25000 విరాళం ఇచ్చిన సంగతి తెలిసిందే.