హెబ్బా.. ఓ ఐటమ్ అబ్బా.. !


కుమారిగా కుర్రకారు మతులుపోగోట్టింది హెబ్బా పటేల్. ‘కుమార్ 21 ఎఫ్’ సినిమాతో టెంప్ట్ చేసింది. గ్లామర్ హీరోయిన్ గా హెబ్బా టాలీవుడ్ ని ఏలుతుంది అనుకొన్నారంతా. కానీ, కాలం కలిసిరాని హీరోయిన్ గా మిగిలిపోయింది. హీరోయిన్ గా అవకాశాలు లేనీ హెబ్బా.. గెస్ట్ పాత్రలకి ఓ చెబుతోంది.

ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చిన నితిన్ భీష్మ సినిమాలో గెస్ట్ రోల్ లో మెరిసింది. రాజ్ తరుణ్ ఓరేయ్ బుజ్జిగా.. సినిమాలోనూ స్పెషల్ పాత్రలో మెరవబోతుందట. గెస్ట్ రోల్స్ మాత్రమే కాదు ఐటమ్ సాంగ్స్ చేస్తోంది. కిషోర్ తిరుమల దర్శకత్వంలో రామ్ నటిస్తున్న రెడ్ సినిమాలో హెబ్బా ఐటమ్ సాంగ్ చేసింది. దాంతోపాటు ఒకట్రెండు బిట్స్ సీన్స్ లోనూ మెరవనుందట. మొత్తానికి.. ఇండస్ట్రీలో ఐటమ్ భామల కొరతని హెబ్బా తీర్చేటట్టుంది.