కరోనా కాటు.. పద్మశ్రీ నిర్మల్ సింగ్ మృతి !
కరోనా మరో ప్రముఖుడిని కాటేసింది. కరోనా సోకి పద్మశ్రీ అవార్డు గ్రహీత, స్వర్ణ దేవాలయ మాజా హజారీ రాగి నిర్మల్ సింగ్ ఖల్సా మృతి చెందారు. నిర్మల్ సింగ్ ఖల్సాకు కరోనా ఉందని బుధవారం చేసిన పరీక్షల్లో తేలింది. దీంతో ఆయన్ని వెంటనే ఐసోలేషన్‌కు తరలించి చికిత్స అందించారు. అయితే, చికిత్స పొందుతుండగానే.. నిర్మల్ సింగ్ ప్రాణాలు కోల్పోయారు.
62 ఏళ్ల ఖల్సా 2009లో పద్మశ్రీ పౌర పురస్కారాన్ని అందుకున్నారు. ఇటీవలే విదేశాల నుంచి వచ్చిన సింగ్.. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉండడంతో మార్చి 30న గురునానక్ దేవ్ ఆసుపత్రిలో చేరారు. ఇక దేశంలో కరోనా రోజురోజూకి విజృంభిస్తోంది. ఇప్పటికే 1800కు పైగా పాజిటివ్ కేసులు నమోదవ్వగా.. ముప్పై మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు.