‘సిసిసి’ని చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్ లో కలిపేశారేంటీ.. ?

కరోనా విజృంభిస్తున్న కఠిన సమయాన టాలీవుడ్ కార్మికులను ఆదుకోవాలన్న మంచి ఆశయంతో మెగాస్టార్ చిరంజీవి ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. ఇందుకోసం సిసిసి సంస్థిని ఏర్పాటు చేశారు. ఈ సంస్థకి భారీగా విరాళాలు వెలువెత్తాయ్. అయితే ఇప్పుడీ సంస్థని
చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్ లో కలిపేయడం హాట్ టాపిక్ గా మారింది.

సిసిసి ఫండ్ ను వేరేగా ఏర్పాటు చేసే ఆలోచన వదిలేసి, ఇప్పటికే వున్న చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్ లో కలిపేసారు. చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్ తరపున సిసిసి అనే పేరుతో కొత్త సేవింగ్స్ అక్కౌంట్ ఓపెన్ చేసారు. విరాళాలు మాత్రం చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్-సిసిసి ఫండ్ అని ఇవ్వాలి. చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్ అధినేత చిరంజీవి కాబట్టి ఆయన ప్రధానంగా అక్కౌంట్ హోల్డర్ గా వుంటారు. మరో ఇద్దరిని జాయింట్ గా పెట్టారు. ఇప్పుడు సిసిసి కార్యక్రమాల పర్యవేక్షణ అంతా గీతా సంస్థ నుంచే నడుస్తుంది.

ఎందుకు అలా చేశారంటే ? సినీ స్టార్స్ విరాళాలు ఇవ్వాలంటే ఆదాయపన్ను మినహాయింపు వుండాలి. కానీ సిసిసి అనే సంస్థ ఇప్పుడు ప్రారంభమైంది. దానికి ఆదాయపన్ను మినహాయింపు రావాలంటే ఇప్పట్లో అయ్యేది కాదు. అందుకే ఇప్పటికే వున్న చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్ లో కలిపేసారని తెలుస్తోంది. ఎందులో కలిపితే ఏంటీ ? సినీ కార్మికులకి సాయం అందితే చాలు అనుకోవాలేమో!