రచయిత అబ్బూరి రవికి మాతృవియోగం

ప్రముఖ రచయిత అబ్బూరి రవికి మాతృ వియోగం కలిగింది. ఆయన తల్లిగారు లలిత (73) కన్నుమూశారు. బుధవారం సాయంత్రం గుండెపోటుతో మరణించారు. గురువారం ఉదయం హైదరాబాద్ ఫిల్మ్ నగర్‌లో గల మహాప్రస్థానంలో ఆమె అంత్యక్రియలు నిర్వహించారు. లలితకి నలుగురు మగ సంతానం. వీరిలో రవి అందరి కన్నా చిన్నవాడు. 

టాలీవుడ్ లో రచయిత రవి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. బొమ్మరిల్లు, కిక్, మిస్టర్ పర్ఫెక్ట్, పంజా, ఎవడు, క్షణం, విన్నర్, గూఢచారి, ఎవరు తదితర సినిమాలకి రచయితగా పని చేశారు.