ప్రధాని మరో సంచలన పిలుపు

దేశంలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ ఇప్పటికే రెండు సార్లు జాతిని ఉద్దేశించి మట్లాడారు. మొదటిసారి
మాట్లాడినప్పుడు జనతా కర్ఫ్యూ కి పిలుపునిచ్చారు. అది విజయవంతం అయింది. ఈ సందర్భంగా ఆ రోజు సాయంత్రం 5గంటలకి చప్పట్లు, శబ్దాలు చేయాలన్న ప్రధాని పిలుపు మేరకు ప్రజలంతా ఐక్యతని చాటారు. ఇక రెండో సారి ప్రధాని జాతిని ఉద్దేశించిన మాట్లాడిన సమయంలో లాక్‌డౌన్‌ ప్రకటించారు. కరోనా కట్టడి కోసం ఇంతకంటే మరో మార్గం లేదని.. ప్రజలు సహకరించాలని కోరారు. ప్రస్తుతం దేశంలో లాక్‌డౌన్‌ బాగానే అమలు అవుతోంది. ఈ నెల 14 వరకు కొనసాగనుంది.

ఇక గురువారం అన్నీ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు ప్రధాని. కరోనా కట్టడి, లాక్‌డౌన్‌ ఎత్తివేసిన తర్వాత చోటు చోసుకోబోయే పరిస్థితుల గురించి చర్చించారు. వీడియో కాన్పరెన్స్ ముగియగానే ప్రధాని ఓ ట్విట్ చేశారు. రేపు (శుక్రవారం) ఓ వీడియో మెసెజ్ విడుదల చేస్తానని తెలిపారు. దీంతో లాక్‌డౌన్‌ ఎత్తివేత, లేక కొనసాగింపుపై ప్రధాని కీలక ప్రకటన చేస్తారని అంతా భావించారు. కానీ ప్రధాని దేశ ప్రజలకి మరో పిలుపునిచ్చారు. ఈ ఆదివారం (ఏప్రిల్ 5) రాత్రి 9గంటలకి ప్రజలంతా 9 నిమిషాలపాటు లైట్స్ ఆఫ్ చేసి.. దీపాలు వెలిగించాలని.. మరోసారి జాతి ఐక్యతని చాటాలని పిలుపునిచ్చారు. ఇది కూడా జనతా కర్ఫ్యూ రోజున చప్పట్లు సరిచినంత రేంజ్ లో విజయవంతం అవుతుందేమో చూడాలి.