తెలంగాణకి కేంద్రం పంపిన గిఫ్ట్ ఏంటో తెలుసా ?
లాక్డౌన్ నేపథ్యంలో వలస కూలీలని ఆదుకోవడంలో తెలంగాణ ప్రభుత్వం ముందుంది. కేంద్రం చెప్పకముందే వలస కూలీలని ఆదుకుంటామని తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రకటించారు. వలస కూలీలకి కూడా ఒకొక్కరి చొప్పున 12కేజీల బియ్యం, రూ. 500లు అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రజలకు మరింతగా అండగా నిలిచేందుకు సీఎం కేసీఆర్ కేంద్రం సాయం చేయాలని కోరారు. ఈ మేరకు కేంద్రం కూడా సానుకూలంగా స్పందించారు. ఏకంగా తెలంగాణకు 50వేల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని కేంద్రం పంపింది.
ఇక ఏప్రిల్ 7నాటికి కరోనా ఫ్రీ తెలంగాణ చూస్తామని సీఎం కేసీఆర్ భావించారు. కానీ ఢిల్లీలోని నిజాముద్దీన్ మర్కజ్ ఉదంతం తర్వాత పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. తెలంగాణ ఉంచి ఈ మర్కజ్‌కు సుమారు వెయ్యిమందికిపైగా ముస్లింలు వెళ్లిరావడంతో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య కూడా అమాంతంగా పెరిగిపోయింది. ఇప్పటి వరకు తెలంగాణలో 154 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఢిల్లీకి వెళ్లిన వారందరినీ గుర్తించి, వైద్యసేవలు అందించేందుకు అహర్నిశలు శ్రమిస్తోంది.