ఇకపై లాక్‌డౌన్‌ను మరింత కఠినంగా !


దేశంలో లాక్‌డౌన్‌ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ నెల 14వరకు లాక్‌డౌన్‌ కొనసాగనుంది. అంటే.. మరో రెండువారాలు లాక్‌డౌన్‌ పాటించాల్సిందే. అయితే, లాక్‌డౌన్‌ ని లైట్ గా తీసుకొని జనాలు బయట తిరుగుతున్నారు. దీన్ని సీరియస్ గా తీసుకున్న కేంద్ర హోంశాఖ..  అన్ని రాష్ట్రాల సీఎస్‌లకు సీరియస్ ఆదేశాలు చేసింది. ఈ రెండు వారాలు లాక్‌డౌన్‌ ని మరింత కఠినంగా అమలు చేయాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో తెలంగాణలో నేటి నుంచి లాక్‌డౌన్‌ను మరింత కఠినంగా అమలు చేయబోతున్నారు.
 
లాక్‌డౌన్‌ రూల్స్ బ్రేక్ చేస్తే రెండేళ్లపాటు జైలుకి పంపిస్తామని అధికారులు హెచ్చరిస్తున్నారు. తెలంగాణలో 25 వేల లాక్ డౌన్ కేసులు, 34 వేల వాహనాలను అధికారులు సీజ్ చేశారు. కారణం లేకుండా బయటకు వస్తే నేరుగా జైలుకే పంపిస్తామని అధికారులు హెచ్చరిస్తున్నారు. సెక్షన్ 188 ఐపీసీ, 271 ప్రాణాంతక వ్యాధులు, ప్రాణాలకు ముప్పు, క్వారంటైన్ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించడం వంటి అంశాలపై కేసులు నమోదు చేయడం జరుగుతుందని చెబుతున్నారు.