ఆ దేశంలో లాక్‌డౌన్‌ లేకుండానే కరోనా కంట్రోల్

ప్రపంచ దేశాలని కరోనా వైరస్ వణికిస్తోంది. ఈ మహమ్మారిని కంట్రోల్ చేయడానికి లాక్‌డౌన్‌ ఒక్కటే మార్గమని భారత్ తో పాటు ఇతర దేశాలు.. లాక్‌డౌన్‌ ప్రకటించేశాయ్. కానీ స్వీడ‌న్ మాత్రం లాక్‌డౌన్‌ ప్రకటించకుండానే కరోనాని కంట్రోల్ చేస్తుండటం విశేషం. అదేలా అంటే సోషల్ డిస్టెన్స్ ని ఫాలో కావడం.

స్వీడన్ లో కరోనా కలవరం లేదని కాదు. ఆ దేశంలో 5వేలమంది కరోనా బారినపడ్దారు. కరోనా కాటుకి 500మంది చనిపోయారు. అయినా.. స్వీడ‌న్ లో  ఇప్పటికీ స్కూళ్లు న‌డుస్తున్నాయి. ప్ర‌జా ర‌వాణా న‌డుస్తున్న‌ది. కేఫ్‌లు, బార్లు తెరిచే ఉంటున్నాయి. అయితే ఈ రెండు చోట్ల మాత్రం జ‌నం గుమికూడ‌కుండా కేవ‌లం టేబిల్ స‌ర్వీస్ రూల్ అమ‌లు చేస్తున్న‌ది. అయితే స్వీడన్ లో కొత్త కరోనా కేసులు నమోదవ్వడం లేదు. ఇందుకు కారణం ఆ దేశ ప్రజలు స్వీయ నియంత్రణ పాటించడం, సోషల్ డిస్టెన్స్ కి ఫాలోకావడమేనని చెబుతున్నారు.

మనదేశంలోనూ ఏప్రిల్ 14 తర్వాత లాక్‌డౌన్‌ ఎత్తివేసినా సోషల్ డిస్టెన్స్ ని ఫాలో అయితే కరోనా నుంచి మనం తప్పించుకోవచ్చు. మన సమాజాన్ని, మనదేశాన్ని కాపాడుకోవచ్చని చెబుతున్నారు. లాక్‌డౌన్‌ లేకుండా కరోనాని కట్టడి చేయడంలో స్వీడన్ ఇతర దేశాలని ఆదర్శంగా నిలవనుందని చెప్పవచ్చు.