స్మృతి మంధానకు హీరోయిన్ ఆఫర్ 

టీమిండియా మహిళా క్రికెటర్‌ స్మృతి మంధానకు హీరోయిన్ ఆఫర్ వచ్చేసింది. దానికి స్మృతి స్పందన ఏంటీ చెప్పేముందు.. ఇంతకీ హీరోయిన్ గా ఆఫర్ చేసేంది ఎవరో చూద్దాం. కరోనా వైరస్‌ కారణంగా ఒలింపిక్స్‌తో సహా ఎన్నో టోర్నీలు రద్దయ్యాయి. దీంతో క్రీడా ప్రముఖలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. కుటుంబంతో కలిసి సమయాన్ని ఆస్వాదిస్తున్నారు. కొందరు సామాజిక మాధ్యమాల్లో అభిమానులతో ముచ్చటిస్తున్నారు. తాజాగా స్మృతి మందాన అభిమానులతో చిట్ చాట్ చేసింది.

ఈ సందర్భంగా ఓ నెటిజన్ మీరు ఎంతో అందంగా ఉంటారు. హీరోయిన్‌గా నటిస్తారా? మిమ్మల్ని సినిమాల్లో చూడొచ్చా? అని అడిగారు. దానికి ‘నేను నటిస్తే.. ఆ సినిమాని చూడటానికి థియేటర్లకు ఎవరూ రారు. మీరు అలాంటివి ఆశించకండి’ అని సమాధానం ఇచ్చింది. లవ్‌-అరెంజ్డ్‌ మ్యారేజ్ అంటే ఇష్టం. కాబోయేవాడికి రెండు అర్హతలు ఉండాలి. ఒకటి.. అతడు నన్ను ఎంతో ప్రేమించాలి. రెండు.. ఒకటిని తప్పక పాటించాలని చెప్పుకొచ్చింది.  ప్రపంచకప్‌ను ముద్దాడటమే నా జీవితంలో చిరస్మరణీయంగా మిగిలిపోతుంది. ఏదో ఒక రోజు తప్పక కప్‌ను అందుకుంటానని ఆశాభావం వ్యక్తం చేసింది.