శాతవాహన యూనివర్శిటీలో టెన్షన్.. !!
ఉద్రిక్త వాతావరణం నుంచి ఉస్మానియా యూనివర్శిటీ తేరుకుంటుండగానే మరో యూనివర్శిటీలో వాతావరణం వేడెక్కింది. కరీంనగర్ జిల్లాలోని శాతవాహన యూనివర్శిటీలో రెండు వర్గాల మధ్య ఘర్షన చినికి చినికి గాలివానగా మారుతోంది. ఏబీవీపీ, బహుజన విద్యార్థి సంఘాల(BSF) మధ్య ఘర్షణ పెరిగింది.
యూనివర్శిటీలో మనుస్మృతిని కొంతమంది తగల బెట్టారని ఏబీవీపీ విద్యార్థుల దాడికి దిగారు. ఇరువర్గాల మధ్య రాళ్లదాడి జరిగింది.. దీంతో యూనివర్శిటీలో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. బీజేపీ కార్యకర్తలు భారీగా యూనివర్శిటీకి చేరుకోవడంతో సీపీ కమలాసన్ రెడ్డి పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.
ఉదయం 9 గం.ల ప్రాంతంలో మనుధర్మ శాస్త్రాన్ని లెఫ్ట్ వింగ్, దళిత స్టూడెంట్స్ తగలబెట్టారని, సమాచారం తెలుసుకున్న ఏబివీపి స్టూడెెంట్స్ గొడవకి దిగారని సీపీ కమలాసన్ రెడ్డి గొడవకు గల కారణాలను వివరించారు. ఎవరికి గాయాలు కాలేదని,సంఘటనపై విచారణ చేస్తున్నామని ఆయన తెలిపారు. గొడవలు పునరావృతం కాకుండా యూనివర్సిటీ ముందు పికెటింగ్ ఏర్పాటు చేస్తున్నామన్నారు సీపీ కమలాసన్ రెడ్డి.