సచిన్ కి క్రెడిట్ ఇవ్వని ధోని
ఒకటి కాదు రెండు వరల్డ్ కప్ లని తెచ్చిపెట్టిన ఘనత మహేంద్ర సింగ్ ధోనికి దక్కింది. ధోని సారధ్యంలోనే టీమిండియా టీ20 వరల్డ్ కప్, 2011 వన్డే వరల్డ్ కప్ ని గెలుచుకున్నాయి. 2011 వన్డే వరల్డ్ కప్ పైనల్లో ధోనిని ఐదవ స్థానంలో బ్యాటింగ్ వచ్చి కెప్టెన్ ఇన్నింగ్స్ తో విజయాన్ని అందించాడు. ఆఖరులో ధోని కొట్టిన విన్నింగ్ సిక్సర్ క్రికెట్ చరిత్రలోనే నిలిచిపోయింది.
సచిన్ సలహాతోనే ప్రపంచ కప్ ఫైనల్ లో ధోని 5వ స్థానంలో బ్యాటింగ్ కి వచ్చాడట. ఈ విషయాన్ని తాజాగా సచిన్ బయటపెట్టాడు. ధోని ఎక్కువగా ఆరో స్థానంలో బ్యాటింగ్ చేస్తాడు. కాని ఆరోజు శ్రీలంక బౌలర్ ముత్తయ్య మురళీధరన్‌తో బౌలింగ్ చేయించేలా కనిపించింది. దీంతో బాగా ఫామ్‌లో ఉన్న యువీని కాదని ధోనిని బ్యాటింగ్ కు పంపడానికి కారణం ధోని ఎక్కువగా స్పిన్ బౌలింగ్‌ను ఎదుర్కొనగలడని సచిన్ తెలిపాడు. అయితే ధోని బయోపిక్ లో సచిన్ సలహాని చూపించలేదు. దీంతో వరల్డ్ కప్ క్రెడిట్ ని సచిన్ కి ఇచ్చేందుకు ధోని ఇష్టపడలేదని తెలుస్తోందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.