రాష్ట్రపతి, ఎంపీ జీతాల్లో భారీ కోత
కరోనా ఎఫెక్ట్ తో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్యోగులకి పూర్తి స్థాయిలో జీతాలు చెల్లించలేని పరిస్థితి. ఇప్పటికే ప్రభుత్వ ఉద్యోగుల జీతాల్లో కోత విధిస్తున్నట్టు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే అత్యవసర పరిస్థితుల్లో విధులు నిర్వహిస్తున్న పోలీసులు, వైద్యులు, స్వచ్ఛ కార్మికులకి మాత్రం పూర్తి స్థాయిలో జీతాలు ఇస్తామని తెలిపాయి.
ఇప్పుడు కేంద్రం కూడా ప్రజాప్రతినిధుల జీతాల్లో భారీ కోత విధిస్తూ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రపతి, ప్రధాని, ఎంపీల జీతాల్లో 30శాతం కట్ చేస్తామని ప్రకటించింది. ఇదీగాక ఎంపీల్యాడ్స్ స్కీంను రెండేళ్ల పాటు రద్దు చేస్తున్నట్లు తెలిపింది. కన్సోలిడేట్ ఫండ్ కింద రూ.7వేల 900కోట్లు ఎంపీల్యాడ్స్ స్కీం నుంచి ప్రభుత్వానికి అందుతాయని కేంద్ర మంద్రి ప్రకాశ్ జవదేవకర్ తెలిపారు.