కరోనాపై గెలిచిన సెలబ్రెటీ

బాలీవుడ్ సింగర్ కనికా కపూర్ కరోనా కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు. కొద్దిరోజుల క్రితం లండన్ నుండి వచ్చిన ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్ అని వచ్చింది. దీనితో డాక్టర్స్ ఆమెకు లక్నో నందు గల సంజయ్ గాంధీ ఇన్స్టిట్యూట్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో వైద్యం అందిస్తున్నారు.

అయితే ఆమెకి తొలి నాలుగు సార్లు నిర్వహించిన టెస్ట్‌ల్లోనూ కరోనా పాజిటివ్‌ వచ్చింది. దీంతో ఆమె కరోనా నుంచి బయటపడటం కష్టమేనని ఆందోళన చెందారు. కానీ ఐదోసారి నిర్వహించిన కరోనా నిర్ధారిత పరీక్షల్లో నెగెటివ్‌ రావడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. ఆరోసారి చేసిన పరీక్షల్లోనూ నెగటివ్ రావడంతో ఆమెను డిశ్చార్‌ చేశారు.